Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 టీ20 మ్యాచ్ లు ఆడిన దేశాలలో.. అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా టీమిండియా

  • ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా 
  • ఇటీవల తొలి టీ20లో విజయం
  • మొత్తం 100 మ్యాచులు ఆడిన భారత్‌
  • ఈరోజు ఐర్లాండ్‌తో రెండో టీ20
ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో టీమిండియా డబ్లిన్‌లో మొన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి 8.30 గంటల నుంచి రెండో టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ టీ20లో ఓపెనర్లు మినహా మిగతా అందరి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులుంటాయి. కాగా, మొన్న జరిగిన టీ20 మ్యాచుతో టీమిండియా 100 టీ20 మ్యాచులు ఆడిన జట్టుగా నిలిచింది.

 ఈ నేపథ్యంలో క్రికెట్‌ విశ్లేషకులు టీ20ల్లో టీమిండియా సాధించిన విజయాలను గురించి ప్రస్తావిస్తున్నారు. టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్‌ ఉంది. ఆడిన 100 మ్యాచుల్లో టీమిండియా 62 మ్యాచుల్లో విజయం సాధించింది. 100 మ్యాచ్‌లు ఆడిన మొత్తం దేశాల వివరాలను విశ్లేషిస్తే.. భారత్‌ 62 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 59, పాకిస్థాన్‌ 58, ఆస్ట్రేలియా 53, శ్రీలంక 51 విజయాలతో భారత్‌ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
India
Cricket

More Telugu News